GHMC | వీధి వ్యాపారులకు చేయూత.. జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు
గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. తాజాగా వీధి వ్యాపారులకు మూడో విడతలో ఒక్కొక్కరికి రూ.50 వేలను పంపిణీకి శ్రీకారం చుట్టింది.
- జీహెచ్ఎంసీ సర్వేలో 1,65,638 మంది గుర్తింపు
- 1,65,301 మందికి గుర్తింపు కార్డుల జారీ
- వ్యాపారాభివృద్ధికి గాను రూ.130.76 కోట్ల సర్దుబాటు
- తాజాగా మూడో విడత పంపిణీకి శ్రీకారం
- వీధి వ్యాపారుల్లో జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు
GHMC | సిటీబ్యూరో, మార్చి 24(నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. తాజాగా వీధి వ్యాపారులకు మూడో విడతలో ఒక్కొక్కరికి రూ.50 వేలను పంపిణీకి శ్రీకారం చుట్టింది. రుణాల పంపిణీలో భాగంగా వీధుల్లో తిరుగుతూ చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించే ఉద్దేశంతో హైదరాబాద్ మహా నగరంలో సర్వే చేయగా, 1,65,638 మందిని గుర్తించారు. అందులో భాగంగా 1,65,301 మందికి గుర్తింపు కార్డులను జారీ చేశారు. 30 వెండింగ్ కమిటీలను ఏర్పాటుతో పాటు 584 కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే మూడో విడతలో 5,808 మందికి గాను రూ.28.69 కోట్ల రుణాలను అందజేయగా, మొత్తం మూడు విడతల్లో 85,441 మందికి రూ.130.76 కోట్ల రుణాలను అందించారు. కాగా ఇప్పటి వరకు రూ.2.24 కోట్లను వీధి వ్యాపారులు క్యాష్ బ్యాక్ చేశారు.
వీధి వ్యాపారుల్లో మరింత చైతన్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆమలు చేస్తున్న వీధి వ్యాపారుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పీఎం సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన, శ్రమయోగి మందన్ ఫించన్ యోజన, మాతృవందన యోజన, జననీ సురక్షణ యోజన, జన్‌ధన్ యోజన, వన్ నేషన్ వన్ కార్డు, తదితర పథకాలను మరింత పకడ్బందీగా అందించేందుకు వీధి వ్యాపారుల పూర్తి వివరాలతో కూడిన సమాచారాన్ని పొందుపర్చేందుకు వెబ్ ఆధారిత ప్రత్యేక సమగ్ర యాప్‌ను రూపొందించింది. ఇందులో భాగంగానే వీధి వ్యాపారులను చైతన్యం చేసే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు ‘మై బీ డిజిటల్’ అనే కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహిస్తున్నారు. వీటితో పాటు వీధి వ్యాపారులతో స్విగ్గీ, జుమోటోలు ఒప్పందం కుదుర్చుకుంటుండటం గమనార్హం.
స్ట్రీట్ వెండర్స్ వివరాలు
- వీధి వ్యాపారులను గుర్తించినవి 1, 65,638
- ఐడీ కార్డులు జారీ చేసినవి 1,65,301
- టౌన్ వెడింగ్ కమిటీల ఏర్పాటు 584గ్రూపులు

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

