సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలపై టౌన్‌ప్లానింగ్ విభాగం మరింత కఠినంగా వ్యవహరించనున్నది. ఇక మీదట సంబంధిత భవనాన్ని సీజ్ చేయనున్నారు. సదరు భవనం చుట్టూ ఎరుపు రంగు రిబ్బన్‌ను చుట్టడం, గేటుకు తాళం వేసి లక్కతో సీల్ చేయడం, తలుపులు లేకపోతే భవనం పరిసరాలను కర్రలు, చెక్కలు, ఇతర వస్తువులతో మూనేసి దాని చుట్టూ రిబ్బన్‌ను చుట్టి దానిపై అధికారి సంతకం సీల్ వేస్తారు. ఇటీవల హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.అక్రమ నిర్మాణామని తేలితే చాలు ముందుగా పనులు జరగనీవ్వకుండా ఆ భవనాన్ని సీజ్ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఆర్ వీ కర్ణన్.. జోనల్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
ఇక మీదట కూల్చివేత ఉత్తర్వు (స్పీకింగ్ ఆర్డర్)కు ముందు లేదా ఆ ఉత్తర్వు ఇచ్చాక ఆమోదం పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా జరిగే నిర్మాణాలను అనుమతి లేని భవనాలను జీహెచ్ఎంసీ చట్టం -1955లోని సెక్షన్ 461-ఏ కింద జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ , డిప్యూటీ కమిషనర్ సీజ్ చేయనున్నారు. ఒకసారి సీల్ వేసిన భవనాన్ని తెరిచే అధికారం కొందరికే ఉంటుంది.. డిప్యూటీ కమిషనర్ సీజ్ చేసిన భవనాన్ని జోనల్ కమిషనర్, జోనల్ కమిషనర్ సీజ్ చేసిన భవనాన్ని కమిషనర్ మాత్రమే తొలగించాల్సి ఉంటుంది.
15 రోజుల వ్యవధితో షోకాజ్ నోటీసు
నిర్మాణ జరిగిన ప్రాంతాన్ని తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణదారుడిపై నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. దాని ఆధారంగా నిర్మాణదారుడు అనుమతి లేకుండా చేపట్టిన భవనం, అంతస్తులు, ప్లాన్‌ను ఉల్లంఘించిన చేపట్టిన భాగాన్ని ఎందుకు 15 రోజుల్లో కూల్చకూడదో తెలుపుతూ సంబంధిత యాజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసును యజమానికి అందజేయడంతో పాటు అందినట్లుగా సదరు నిర్మాణదారులు, సంస్థ సంతకం తప్పనిసరి.
సమాంతరంగా నోటీసును జిల్లా కలెక్టర్, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం బాధ్యులకు, జోనల్ కమిషనర్లకు ఈ మెయిల్ ద్వారా చేర్చాల్సి ఉంటుంది. నోటీసు అందుకున్నాక కూడా నిర్మాణ పనులు కొనసాగుతుంటే జీహెచ్ఎంసీ సదరు భవనాన్ని సీజ్ చేసి తదుపరి విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అప్పటికే ఆ నిర్మాణాన్ని ఎవరైనా వినియోగిస్తున్నట్లయితే ఖాళీ చేసేందుకు వారికి మూడు రోజుల గడువు ఇచ్చి తర్వాత సీజ్ చేయాలి.
భవనం సీజ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ?
సంబంధిత అనధికారిక భవనం చుట్టూ ఎరుపు రంగు రిబ్బన్‌ను చుట్టడం, గేటుకు తాళం వేసి లక్కతో సీల్ చేయడం, తలుపులు లేకపోతే భవనం పరిసరాలను కర్రలు, చెక్కలు, ఇతర వస్తువులతో మూనేసి దాని చుట్టూ రిబ్బన్‌ను చుట్టి దానిపై అధికారి సంతకం సీల్ వేస్తారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, పోలీసుల పేర్లతో ఎలా సీల్ వేశారో తెలుపుతూ ఫొటోలు, వీడియోలను జత చేసి సంబంధిత అధికారి కమిషనర్‌కు నివేదిక పంపించనున్నారు. తదుపరి వెంటనే విద్యుత్, జలమండలికి సీజ్ చేసిన నివేదికను పంపించి విద్యుత్, తాగునీటి కనెక్షన్లను నిలిపివేయాలని లేఖ రాయనున్నారు. ఆయా పోలీస్ స్టేషన్‌కు , సబ్ రిజిస్ట్రార్ – మిగతా IV లో