సిటీబ్యూరో, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 18 ఎజెండా అంశాలతోపాటు ఆరు టేబుల్ ఐటమ్లకు కమిటీ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాకు రూ.20కోట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనను కమిటీ సభ్యులు తిరస్కరించడం గమనార్హం. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, పర్వీన్ సుల్తానా, మహ్మద్ సలీం, డాక్టర్ అయేషా హుమేరా, మహాలక్ష్మి, రామన్ గౌడ్, సీఎన్ రెడ్డి, మహ్మద్ బాబా ఫసియుద్దీన్, బూరుగడ్డ పుష్ప తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన అంశాలు