మలక్‌పేట, జనవరి 9 : పాత మలక్‌పేట డివిజన్లోని కాలనీల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది రహదారులపై గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు సమస్యను ఎమ్మెల్యే అబ్దుల్లా బలాలకు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఎమ్మెల్యే యుద్ధప్రాతిపదికన గుంతల పూడ్చివేత పూర్తిచేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ సిబ్బంది గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు.
అఫ్జల్‌నగర్ మెయిన్ రోడ్, వాహెద్నగర్తోపాటు వెస్ట్ ప్రశాంత్‌నగర్, తీగలగూడ కాలనీల్లో గుంతలను బీటీతో పూడ్చివేశారు. కాలనీవాసులు తాగునీరు, డ్రైనేజీ కనెక్షన్ల కోసం తవ్వకాలు చేపట్టడంతో రహదారులు గుంతలమయంగా తయారైనాయని, ప్రస్తుతం అన్నిగుంతలను బీటీతో పూడ్చివేస్తున్నామని అధికారులు తెలిపారు. పాత రోడ్డుకు సమాంతరంగా బీటీతో గుంతలను పూడ్చివేసి కంబాక్టర్తో అణగ దొక్కిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీతో చేస్తున్న ఈ ప్యాచ్‌వర్క్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రోడ్డంతా ఒకే లెవెల్‌తో ప్యాచ్‌లు లేనట్లుగా నునుపుగా, అందంగా కనిపిన్నాయి. పనులను జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలిస్తున్నారు. కార్యక్రమంలో సిబ్బంది, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం..
చాదర్‌ఘాట్, జనవరి 9 : డివిజన్లో మౌలిక సదుపాయాలన కల్పిస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని ఆజంపురా కార్పొరేటర్ ఎంఏ.సలాం షాహీద్ అన్నారు. చావునీ-నాద్-ఏ-అలీ బేగ్ ప్రాంతంలో సీసీ రోడ్డు పనులను సోమవారం కార్పొరేటర్ పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయించడంపై స్థానికులు కార్పొరేటర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు పనులు పూర్తి కానుండడంతో ఎమ్మెల్యే అహ్మద్ బలాల, కార్పొరేటర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని..సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఈ మల్లికార్జున్, అహ్మద్ పాల్గొన్నారు.