GHMC | బండ్లగూడ, ఏప్రిల్ 25 : దోమల నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. దోమల వృద్ధికి కారణమైన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించేందుకు సుదీర్ఘ ప్రణాళికతో పనులను ప్రారంభించింది. అత్తాపూర్ డివిజన్ నుంచి మలక్పేట మూసీకి ఇరువైపులా హిటాచీలతో గుర్రపు డెక్కను తొలగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
గుర్రపు డెక్క తొలగించడంతో పాటు దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు డ్రోన్ల సాయంతో యాంటీ లార్వాలను పిచికారి చేస్తున్నారు. అత్తాపూర్ డివిజన్ పరిధిలో ప్రారంభమైన ఈ గుర్రపు డెక్క తొలగింపు పనులను రెండో బాలాజీ విభాగం అధికారి నామాల శ్రీనివాస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇటీవల దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.