సికింద్రాబాద్ : సికింద్రాబాద్ పార్సి గుట్టలోని ఏవన్ ఫ్రెష్ చికెన్ షాప్ పై సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్, జీహెచ్ఎంసీ అధికారుల సంయుక్త దాడులు చేపట్టారు. చాలా రోజుల నుంచి నిలువ ఉంచిన చికెన్ అమ్ముతున్నట్లు గుర్తించిన అధికారులు, 800 కిలోల చికెన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ చికెన్‌ను బార్లు, రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నట్లు తెలిపారు. గత జనవరి నెలలోనే లైసెన్స్ అయిపోయినట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి షాపు నిర్వాకుడు షకిలతోపాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.