హైదరాబాద్‌లోని పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలోని యూసఫ్‌గూడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ముషీరాబాద్, అంబర్‌పేట, నల్లకుంట, గాంధీనగర్, కాచిగూడ, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, అఫ్జల్‌గంజ్, సైదాబాద్, సంతోశ్ నగర్, చాంద్రయాణగుట్ట, ఫలక్‌నుమా, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్‌లో 2.11 సెం.మీ.లు, బహదూర్‌పురా మండలం జానుమాలో 1.83 సెం.మీ. రాజేంద్రనగర్‌లో 1.63 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇంజనీరింగ్ అధికారులను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి అప్రమత్తం చేశారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయం కోసం.. 040- 2111 1111కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.