GHMC Officers | సికింద్రాబాద్-మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు షాపులు కూల్చివేయడానికి వచ్చారు. జీహెచ్ఎంసీ అధికారులు పోలీసుల పహారాలో షాపులు నేలమట్టం చేసేందుకు జేసీబీలను తీసుకొచ్చారు. దీంతో ఏరియా పరిధిలోని వ్యాపారులు వారిని అడ్డుకున్నారు. తమకు జీవనోపాధి కల్పిస్తున్న షాపులను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఎదురు తిరిగారు.
వ్యాపారులు అధికారులను అడ్డుకొని దాడికి యత్నంతో జీహెచ్ఎంసీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. షాపులను కూలగొట్టడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్‌ని ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ -మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్‌లో జీహెచ్ఎంసీ అధికారులు చిరు వ్యాపారుల షాపులు తొలగిస్తున్నారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాస్త సమయం ఇస్తే తామే తొలగించుకుంటామని చెప్పినా వినకుండా బాధితులతో జీహెచ్ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపడుతున్నారు.
సికింద్రాబాద్ – మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత
షాపులు కూల్చివేయడానికి వచ్చిన GHMC అధికారులు
కూల్చివేతలను నిరసిస్తూ ఎదురు తిరిగిన వ్యాపారులు
పోలీసులను, జేసీబీలను అడ్డుకొని దాడికి యత్నం
భయంతో పరుగులు తీసిన GHMC సిబ్బంది
పోలీస్ స్టేషన్‌ని ముట్టడించి ఆందోళనకు… pic.twitter.com/CfOKWSmTp5
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2026
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరాంఘర్‌లో చిరు వ్యాపారుల షాపులు తొలగిస్తున్న GHMC అధికారులు
బాధితులతో కఠినంగా వ్యవహరిస్తున్న GHMC అధికారులు
ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని బాధితులు ఆవేదన
భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు
కాస్త సమయం ఇస్తే తామే… https://t.co/t85hjNdvGU pic.twitter.com/hx59G0KqO9
— Telugu Scribe (@TeluguScribe) April 4, 2026