సిటీబ్యూరో: పురపాలక మార్కె ట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మోడల్ మార్కెట్లు, లీజు భూములు వంటి ఆస్తుల నిర్వహణను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఆధునిక డిజిటల్ ప్లాట్ ఫాం అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ఎస్టేట్ మేనేజ్మెంట్ సిస్టం(ఈఎంఎస్) పేరుతో రూపొందించిన ఈ యాప్‌ను ఈ నెల 24న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈఎంఎస్ ద్వారా లీజుదారులు తమ లీజు చెల్లింపులు, అద్దె మొత్తాలను ఆన్లైన్లోనే సులభంగా చెల్లించవచ్చు. మానవ జోక్యం తగ్గి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందుతాయన్నారు. వినియోగదారులు ఫ్రెండ్లీగా రూపొందించిన ఈ యాప్‌లో డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ (డీసీబీ) వివరాలు రియల్ టైమ్‌లో కనిపిస్తాయన్నారు. ఫీల్డ్ స్థాయి నుంచి హెడ్ ఆఫీస్ వరకు మానిటరింగ్‌కు దోహదపడుతుందన్నారు. పురపాలక ఆస్తుల నిర్వహణను బలోపేతం చేయడం ప్రభావవంతంగా నిర్వహించడంలో ఈ డిజిటల్ వేదిక కీలకంగా నిలువనున్నదని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.