హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కొవిడ్ హెల్ప్ లైన్ నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 040- 21111111 నంబర్‌కు కాల్ చేయొచ్చు అని ఆమె సూచించారు. కరోనా కంట్రోల్ రూమ్ నుంచి అన్ని రకాల సేవలు అందిస్తున్నామని మేయర్ స్పష్టం చేశారు. ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని మేయర్ అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీలో 99 శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిందని మేయర్ పేర్కొన్నారు. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీలో సరిపడా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో రసాయనాలు పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరోసారి ఫీవర్ సర్వే చేస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
Interacted with Covid Control team of @GHMCOnline about daily incoming calls & follow-up action, coordination between other departments & their deployment of response teams in the affected areas. Call GHMC Covid helpline number 040- 21111111 for any emergency. @KTRTRS #GHMC pic.twitter.com/Hq80WF7EGH
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) January 7, 2022