సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ ): వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో వరద నివారణ చర్యలను వేగవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కూకట్పల్లి జోన్‌లోని మూసాపేట్, గాజులరామారం, కూకట్పల్లి సరిల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అన్నివిభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. జోనల్ కమిషనర్ అపూర్వ చౌహన్, జోనల్ ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈలు.. రమేష్, శ్రీనాథ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సహాయక చర్యలు చేపట్టాలి
నగరంలో కురుస్తున్న అకాల వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని, బాధితులకు తక్షణ సహాయం అందించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కురిసిన వర్షంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 155 ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని, వాటి ఆధారంగా జీహెచ్ఎంసీ పరిధిలో కురిసినసగటు వర్షపాతం 2.3 మీమీగా నమోదైందన్నారు.
మంత్రిని కలిసిన కమిషనర్..
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సిటీ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్వీ కర్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు.