నిరంతరం.. అప్రమత్తం
గ్రేటర్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తమై ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీరును తొలగించేందుకు 238 స్టాటిక్, 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు పనిచేస్తున్నాయని, ఈ బృందాలకు తోడుగా హైడ్రా ద్వారా 30 సీఆర్ఎంపీ, 29 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు నిరంతరం క్షేత్ర పరిధిలో బాధ్యతాయుతంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు.
- వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు రాకుండా చర్యలు
- బల్దియా కమిషనర్ ఆమ్రపాలి
- సాగర్‌లోకి 1517 క్యూసెక్కుల వరద నీరు
సిటీబ్యూరో: గ్రేటర్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తమై ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీరును తొలగించేందుకు 238 స్టాటిక్, 154 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు పనిచేస్తున్నాయని, ఈ బృందాలకు తోడుగా హైడ్రా ద్వారా 30 సీఆర్ఎంపీ, 29 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు నిరంతరం క్షేత్ర పరిధిలో బాధ్యతాయుతంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు.
రూ. 78 కోట్లు.. 107 జంక్షన్లు
ప్రమాదాల నివారణకు గ్రేటర్లో కూడళ్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూడళ్ల సుందరీకరణ, వాహనాలను క్రమబద్ధీకరించడం, పాదచారులకు ప్రమాదాలు జరగకుండా నిరోధించేందుకు రూ.78 కోట్ల అంచనా వ్యయంతో 107 జంక్షన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 31 కూడళ్లు పూర్తవ్వగా, 13 వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. 17 జంక్షన్లు పరిపాలన అనుమతులు రావాల్సి ఉన్నదన్నారు. 16 జంక్షన్లలో పనులు మొదలు పెట్టాల్సి ఉందన్నారు. ఎనిమిది చోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. మరో 8 చోట్ల భూసేకరణ చేయాల్సి ఉన్నదని, 14 జంక్షన్లు ఫిసిబులిటీలో లేవని కమిషనర్ పేర్కొన్నారు. సరిళ్ల వారీగా ప్రాధాన్యత గల జంక్షన్లను గుర్తించి అభివృద్ధి చేస్తామన్నారు.
ఎలాంటి ఆందోళన వద్దు..
హుస్సేన్‌సాగర్ నీటి నిల్వల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నదని బల్దియా అధికారులు స్పష్టం చేశారు. హుస్సేన్‌సాగర్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నదని, పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.30 మీటర్ల మేర నీరు వచ్చి చేరిందన్నారు. గరిష్ఠంగా 514.75 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నదని వివరించారు. ఎగువ ప్రాంతాల నుంచి సాగర్‌లోకి 1517 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, దిగువ మూసీలోకి 998 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

