సిటీబ్యూరో,జనవరి28(నమస్తే తెలంగాణ): జీవో 59 కింద క్రమబద్ధీకరణ పొందిన స్థలాల్లో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
2023 ఆగస్ట్ 17 నుంచి జారీ అయిన జీవో-59 పట్టాలలో లే అవుట్లతో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని సీసీఎల్ఏ ఆదేశించిన నేపథ్యంలో కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా అనుమతులు నిలిపివేయాలన్నారు.