Hyderabad Hitech City | ‘చెత్త కుప్ప’ గా హైటెక్ సిటీ.. ఐటీ కారిడార్కు కూతవేటు దూరంలో దర్శనమిస్తున్న వ్యర్థాలు
Hyderabad Hitech City | హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే ఉన్న కాలనీలు, బస్తీలు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Hyderabad Hitech City | కొండాపూర్, మే 16 : హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే ఉన్న కాలనీలు, బస్తీలు అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాదాపూర్ సర్కిల్ అంజయ్య నగర్ డివిజన్లోని రాజీవ్ వడ్డెర బస్తీ నుంచి ఏఐజీ దవాఖానకు వెళ్ళే దారి మొత్తం చెత్తతో నిండి దుర్వాసనలు వస్తున్నాయంటూ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన చెత్త సమస్యను పరిష్కరించడం లేదంటూ అవేదన చెందుతున్నారు. దారి వెంట వెళ్లాలంటేనే భయపడేలా పరిస్థితులున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారని, స్వచ్ఛ హైదరాబాద్, స్వచ్ఛ తెలంగాణ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త సమస్యను పరిష్కరించి, స్థానిక ప్రజలలో బహిరంగ చెత్త పారవేతపై సరైన అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Hitech Cityf
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

