GHMC | సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో చెత్త సమస్య జటిలంగా మారింది. గార్భే జ్ ఫ్రీ సిటీయే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. అసలే వర్షాలు పడుతున్న వేళ.. కాల నీలు, బస్తీలు కంపుకొడుతున్నాయి. డెంగీ, మలేరియా ఇతర రోగాలతో ప్రజలు సతమతమవుతున్నా.. మేయర్, కమిషనర్ మొదలు జోనల్ కమిషనర్ల వరకు పారిశుధ్య నిర్వహణపై క్షేత్రస్థాయి తనిఖీలు జరపడంలేదు. పారిశుధ్య నిర్వహణలో లోపాలను సరిదిద్ది… ‘స్వచ్ఛ హైదరాబాద్’కు మెరుగైన ర్యాంకింగ్ లక్ష్యంగా కృషి చేయాల్సిన అధికారులు..
ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. డస్ట్ బిన్ లెస్సిటీగా మార్చే లక్ష్యంలో భాగంగా బహిరంగ ప్రదేశా లు, రోడ్ల వెంబడి చెత్త డబ్బాలను తీసేసిన అధికారులు.. తాజాగా డంపర్బిన్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తొలి విడతగా మార్కెట్లు బహిరంగ ప్రదేశాలు కలి పి 28 చోట్ల డంపర్బిన్స్ (పెద్ద చెత్త డబ్బాలు) ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు బల్దియా డంపర్బిన్స్ ఏర్పాటు చేయాలని రాంకీ ఏజెన్సీని ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే ‘స్వచ్ఛ హైదరాబాద్’ లక్ష్యం ప్రశ్నార్థకంగా మారుతుంది.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా..
స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేకుండా.. డస్ట్ బిన్ ఫ్రీ సిటీగా మార్చాలని గత ప్ర భుత్వం నిర్ణయించింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్ల వెం బడి చెత్త డబ్బాలను దాదాపు 800 చోట్లకుపైగా తగ్గించే కార్యక్రమాలను అమలు చేసింది. పెరిగిన జనాభా, కాలనీల్లో చెత్త ఉత్పత్తి పెరుగడంతో అందుకు అనుగుణంగా తరలించే స్వచ్ఛ ఆటోలు, వాహనాలను పెంచుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి చెత్తను ఆటోల్లో ట్రాన్స్ఫర్ స్టేషన్కు, అటు నుంచి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయితే రోడ్లపై చెత్త ఉన్నా అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో రహదారులపై వ్యర్థాల సమస్య తీవ్రరూపం దాల్చుతున్నది.
నీరుగారుతున్న స్వచ్ఛ లక్ష్యం
గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతున్నది. ‘స్వ చ్ఛ సర్వేక్షణ్-2024’లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుపుతామన్న లక్ష్యం నీరుగారుతున్నది. గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా..రోడ్లపై పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) జీహెచ్ఎంసీ పరిధిలో 2640 ప్రాంతాలను గుర్తిం చి.. వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో వీటికి అదనం గా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి.
స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే పారిశుధ్యంపై ఫిర్యాదులు అధి కం కావడం, ఇటీవల హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొ న్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వ యంగా మేయర్ విజయలక్ష్మి పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగలేదని, తన డివిజన్లోనూ చెత్త ఎత్తడం లే దని సంబంధిత అధికారులపై మండిపడడం గమనార్హం.