బడంగ్ పేట్, ఏప్రిల్ 1: ఎయిర్ పోర్ట్ లో హౌస్ కీపింగ్, సూపర్ వైజర్, సీహెచ్ఎంసీలో ఉద్యోగాలంటూ ఘరానా మోసానికి ఓ ముఠా పాల్పడింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ లెనిన్ నగర్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మా వద్ద జాబ్స్ ఉన్నాయని ప్రజలను నమ్మించారు. కూకట్ పల్లి కి చెందిన లక్కీ సెక్యూర్టీస్ సంస్థ పేరుమీద ఉద్యోగాలు ఇస్తామంటూ పేద ప్రజలకు గాలం వేశారు. జీహెచ్ఎంసీ, ఎయిర్పోర్ట్ లో జాబులు ఇప్పిస్తానంటూ పేద అమాయక ప్రజల నుంచి రూ.2000 నుంచి 7000 లు వసూలు చేశారని బాధితులు తెలిపారు.
ఉద్యోగంలో చేరకముందే డబ్బులు తీసుకున్న వారికి నకిలీ ఐడి కార్డులు, యూనిఫాంలో అందజేసిన్నట్లు బాధితులు తెలిపారు. బాధితుల నుంచి సుమారు రూ.4 లక్షలు పైచిలకు వాసులు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. లక్కీ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిని బాధితులు నిలదీయగా ముఖం చాటేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్కీ సెక్యూరిటీ ఎండి మల్లేష్, సహకరించిన వరికుప్పల అలివేలుపై మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో మమత, వి శ్రీశైలం, ఓ శివ, వి రాఘవేందర్, ఎం రజిని, జి జ్యోతి, జి రోజా, మహేష్ తదితరులు ఉన్నారు.