Ganesh Laddu | హైదరాబాద్ : రాయదుర్గంలోని మై హోమ్ భుజాలో గణేశ్ లడ్డూ భారీ ధర పలికింది. వేలంలో ఇల్లందుకు చెందిన కొండపల్లి గణేశ్ అనే వ్యక్తి రూ. 51,77,777కు దక్కించుకున్నాడు. గతేడాది ఇక్కడ లడ్డూ ధర రూ. 29 లక్షలు పలికింది. అప్పుడు ఇదే గణేశ్ లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు.
2024లో రూ. 29 లక్షలు పలుకగా, 2023లో 25.50 లక్షలు పలికింది. 2023లో చిరంజీవి గౌడ్ దక్కించుకున్నారు. 2022లో రూ. 20.50 లక్షల ధర పలుకగా, వ్యాపారవేత్త సత్తిబాబు దక్కించుకున్నారు.
రాయదుర్గం మైహోమ్ భుజాలో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డు
రూ.51,77,777 లక్షలు పలికిన వినాయకుడి లడ్డు https://t.co/8oP1DWta2q pic.twitter.com/3zGNaYwnva
— Telugu Scribe (@TeluguScribe) September 4, 2025