ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనాలు
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనాలు శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ డివిజన్లలో గురువారం సాయంత్రం కొన్ని విగ్రహాలను నిమజ్జనాలకు తరలించినా ఎక్కువశాతం విగ్రహాలు అర్థరాత్రి దాటిన తర్వాతనే ఆయా బస్తీలనుంచి బయలుదేరాయి.
- శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగిన నిమజ్జనాలు- ఉత్సాహంగా లడ్డూ వేలం పాటలు
బంజారాహిల్స్,సెప్టెంబర్ 29: ఖైరతాబాద్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనాలు శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ డివిజన్లలో గురువారం సాయంత్రం కొన్ని విగ్రహాలను నిమజ్జనాలకు తరలించినా ఎక్కువశాతం విగ్రహాలు అర్థరాత్రి దాటిన తర్వాతనే ఆయా బస్తీలనుంచి బయలుదేరాయి. ఫిలింనగర్ 18 బస్తీలు, బంజారాహిల్స్ రోడ్డు నంబర్14లోని నందినగర్, వెంకటేశ్వరనగర్ తదితర బస్తీల్లో ఏర్పాటు చేసిన విగ్రహాల ఊరేగింపు ఉత్సాహంగా కొనసాగింది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఎన్బీటీనగర్, ఎన్బీనగర్ ప్రాంతాల్లో శోభాయాత్రలు నెమ్మదిగా కొనసాగాయి. పోలీసులు ఆయా ఊరేగింపులను వడివడిగా ముందుకు సాగేలా ప్రయత్నాలు చేసినా సుమారు 60 శాతం విగ్రహాల ఊరేగింపులు శుక్రవారం తెల్లవారుజామున 4గంటల దాకా కొనసాగాయి. మొత్తం మీద నియోజకవర్గంలో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా పూర్తి కావడంతో పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వశాఖల అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

- అర్థరాత్రి దాకా కొనసాగిన లడ్డూ పాటలు నిమజ్జనం రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లడ్డూ వేలం పాటలు కొన్ని మండపాల్లో గురువారం అర్థరాత్రి దాకా కొనసాగాయి. వినాయకుడి లడ్డూను దక్కించుకునేందుకు బస్తీల్లో పోటాపోటీగా వేలం నిర్వహించారు.
- ఫిలింనగర్‌లోని దుర్గాభవానీగర్ బస్తీలో ఈదమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను రికార్డు ధరలో ఒర్సు ముత్యాలు దక్కించుకున్నారు.
- పద్మాలయ అంబేద్కర్‌నగర్ బస్తీలో జైశ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డూను దేవేంద్రనాయక్ అనే వ్యక్తి రూ.3లక్షలకు సొంతం చేసుకున్నాడు.

- ఫిలింనగర్ పటేల్‌నగర్ బస్తీలో సిద్ది వినాయక యూత్ అసోసియేషన్ లడ్డూను బస్తీ అధ్యక్షుడు డేరంగుల తిరుపతి రూ.2.1లక్షలకు దక్కించుకున్నారు.
- గౌతంనగర్‌లో ఏర్పాటు చేసిన లడ్డూను రూ.49, 216కు గుంటి గోపాలకృష్ణ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు.
- బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 5లోని దేవరకొండ బస్తీలో ఏర్పాటు చేసిన లడ్డూను అనురాధ, చైతన్య,రే ణుక, సుజాత అనే మహిళలు రూ.1.32 లక్షలకు సొంతం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

