G. Chennaiah | మాలలు మరో పోరాటానికి సిద్ధం కావాలి : జి. చెన్నయ్య
G. Chennaiah | ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనగా మరో పోరాటానికి సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య పిలుపునిచ్చారు.
ఖైరతాబాద్, జూలై 7 : ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనగా మరో పోరాటానికి సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా సరైన ఎంపరికల్ డేటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల మాలలు విద్య ఉద్యోగ రంగాలలో తీవ్రంగా నష్టపోతున్నారని, గ్రూప్-3 లో మాలలతో పాటు మరో 25 కులాలకు అన్యాయం జరిగిందన్నారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఒక్క ఉద్యోగం కూడా గ్రూప్ -3 కి కేటాయించబడలేదంటే మాలలపై ప్రభుత్వం ఏ స్థాయిలో కుట్ర చేసిందో అర్థమవుతుందని, ఈ వర్గీకరణ పై న్యాయపోరాటం చేస్తూనే ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామన్నారు.
మాలలకు జరిగిన అన్యాయంపై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించేందుకే ఈ నెల 11న లకిడికాపూల్ లోనీ వాసవి క్లబ్ లో మాల మహానాడు రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగి ఆనందరావు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే లలిత, మరిపల్లి శ్రీకాంత్, రాజేష్ రాకేష్,శివశంకర్,బాలకృష్ణ, శాలిం రాజు, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

