సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): జపాన్‌కు(Japan) చెందిన ప్రముఖ బహుళజాతీయ కంపెనీ పుజిషు ప్రతినిధులు(Fujishu company) నగరంలోని టీహబ్‌ను(T- Hub) సందర్శించారు. ఈ సందర్భంగా టీహబ్ సీఈఓ ఎం.ఎస్.రావు ప్రతినిధుల బృందానికి టీహబ్ కేంద్రంగా స్టార్టప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఔత్సాహికులతో సమావేశమై టెక్నాలజీ ఆవిష్కరణలను వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఆవిష్కరణల కేంద్రంగా ఉన్న టీహబ్ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్న తీరును ప్రత్యేకంగా ప్రశంసించారు. స్వయంగా ఇన్పర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ అయిన పుజిషు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ హబ్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిని చూపిందని తెలిపారు.