సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్-2లో పటాన్చెరు నుంచి హైదర్‌నగర్ వరకు, కలబ్గూర్ నుంచి పటాన్చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్‌కు వివిధ ప్రాంతాల్లో భారీ లీకేజీలు ఏర్పడ్డాయి.
ఈ లీకేజీలను అరికట్టేందుకు బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం రాత్రి 10 గంటల వరకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఆయా ప్రాంతాల్లోని కొన్ని చోట్ల లోప్రెషర్, మరికొన్ని చోట్ల సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు అధికారులు తెలిపారు. అంతరాయం కలిగే ప్రాంతాలు ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్ ప్రాంతాల్లో వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.