Ambedkar Nagar | సికింద్రాబాద్లోని మారేడ్పల్లి ప్రాంతంలోని అంబేద్కర్ నగర్ బస్తీలో గత నెల రోజులుగా మురుగు నీళ్లు. ఇళ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తున్నాయి. కనీసం అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేదు. మురుగు నీరు పెరిగిపోవడంతో ఈగలు, దోమల బెడద విపరీతంగా పెరిగిపోయింది. బస్తీ వాసులందరూ స్థానిక జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఈ మురికినీటిపైనే ప్రతిరోజూ నడుచుకుంటూ వెళ్తున్నారు. మురుగు నీటి నుండి తమకు ఇంకెప్పుడు విముక్తి కలుగుతుందోనని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.