Medical Coding | బన్సీలాల్ పేట్, ఏప్రిల్ 8 : బీఎస్సీ, బీ ఫార్మసీ, బీకాం పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు ఉచితంగా మెడికల్ కోడింగ్, బిల్లింగ్ కోర్సును అందిస్తున్నామని అప్సా, టెక్ మహీంద్రా ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. మూడు నెలల ఈ కోర్సు అనంతరం ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని వారు తెలిపారు. 21 నుండి 27 ఏళ్ల వయసు కలిగిన యువతీ యువకులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, హబ్సిగూడ చౌరస్తా సమీపంలో, పిల్లర్ నెంబర్ 977 వద్ద ఉన్న తమ శిక్షణ కేంద్రంలో నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు సెల్ నెంబర్ 9154990132, 9154990131 లలో సంప్రదించాలని తెలిపారు.