Tech Mahindra | బన్సీలాల్‌పేట్, మార్చి 13 : టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఫర్ డిజిటల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో వివిధ సాఫ్ట్వేర్ కోర్సుల్లో నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని సంస్థ ప్రతినిధి సత్యనారాయణ తెలిపారు. సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్ సమీపంలో ఉన్న ఓహ్రీ టవర్లోని సంస్థ కార్యాలయములో ఈ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉన్న గ్రాఫిక్ డిజైన్, యుఐ, యుఎక్స్ డిజైన్, జావా ఫుల్ స్టాక్, డిజిటల్ మార్కెటింగ్, సీసీఎన్ఏ, ఏడబ్ల్యూఎస్ కోర్స్‌లో మూడు నెలల నైపుణ్య శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా అందిస్తామని అన్నారు. ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన 30 ఏళ్ళ లోపు వయస్సు గల యువతీ యువకులు ఈ కోర్సుల్లో చేరవచ్చని, మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 7337 332605, 73306 13724 లలో సంప్రదించాలని ఆయన కోరారు.