సులభంగా తొడుకోవచ్చు.. పనులన్నీ చేసుకోవచ్చు
ఈ నెల 28న మల్లారెడ్డి యూనివర్సిటీలో మెగా క్యాంప్
అవసరం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని రోటరీ క్లబ్ పిలుపు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం
సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): రోజు వారి జీవన గమనంలో రెండు చేతులుంటేనే జీవితం నడిచేది అంతంత మాత్రం. మానవుడితో పాటు పక్షులు, జం తు జాలమేదైనా.. కాళ్లూ చేతులు ఉంటేనే ఆ జీవులు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించగలవు. ప్రధానంగా మనిషి ఆహారం తీసుకోవాలన్నా, చదవడం, రా యడం, చివరకు ఎవరికైనా సాయం చేయాలన్నా.. కాళ్లు, చేతులు బాగుంటేనే ఏదైనా చేయగలరు. కానీ, పుట్టుకతోనో.. లేదా విధి వక్రించి కాళ్లు, చేతులు కోల్పోతే.. ఎం తటి కుంగుబాటుకు గురికావాల్సి వస్తుందో ఒకసారి ఆలోచించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అటువంటి వారి కో సం మేమున్నామంటూ.. రోటరీ డిస్ట్రిక్ట్ 3,150 బాధితులను ఆదుకొనేందుకు ముందుకు వస్తున్నది. ఎల్ఎన్ 4 బీలో ఎల్బో మెకానికల్ ఫంక్షనల్ హ్యాండ్స్‌ను ఉచితంగా అందించేందుకు కార్యక్రమాన్ని రూపొందించినట్లు జూబ్లీహిల్స్ రొటేరియన్ శ్రీదేవి తెలిపారు.
అర్హులను గుర్తిస్తున్నారు…
మోచేతి నుంచి కింద వరకు కనీసం 14 సెంటీ మీటర్ల చేయి ఉండాలి. మోచేతికి పై వరకు అమర్చడానికి వీలుండదు. కాబట్టి అందరూ అర్హులు కాకపోవచ్చని శ్రీదేవి తెలిపారు. ఎనిమిదేండ్ల పై బడిన వారంతా ఈ కృ త్రిమ పరికరాలను అమర్చుకోవచ్చని, వయసుల వారీగా పరికరాలను తయారు చేసి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక పౌచ్ కలిగున్న ఈ చేతిని 30 సెకన్లలో అమర్చుకోవచ్చన్నారు. నీరు, వేడి, ఉప్పును తట్టుకుం టుందని, నిత్యం నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చన్నారు.
ఒక్కో పరికరం రూ.30 వేలు…
ఒక్కో కృత్రిమ పరికరం రూ.30 వేల వరకు ఉంటుం ది. కానీ, పూర్తి ఉచితంగానే అందజేయనున్నట్లు తెలిపా రు. ఈ కృత్రిమ అవయవాలు 400 నుంచి 500 మంది దివ్యాంగులకు అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపా రు. ఒకవేళ దరఖాస్తులు ఎక్కువగా వస్తే ఇంకొకసారి కా ర్యక్రమాన్ని ఏర్పాటుచేసి అందరికీ అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అర్హులైన వారు ఈ నెల 28న దూలపల్లిలోని మల్లారెడ్డి వర్సిటీలో జరిగే కార్యక్రమానికి వస్తే, ప్రయాణ చార్జీలు చెల్లిస్తామని పేర్కొన్నారు.
ఎల్ఎన్4 హ్యాండ్స్ ప్రత్యేకత…
అమెరికాకు చెందిన ఎల్లెన్ మీడోస్ ప్రొస్తెటిక్ హ్యాండ్ ఫౌండేషన్ ఈ పరికరాలను రూపొందిస్తున్న ది. రోటరీ డిస్టిక్ట్ 3150 ఆ ఫౌండేషన్ భాగస్వామ్యం తో దేశ వ్యాప్తంగా వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నది. కొన్ని కృతిమ అవయవాలు అందుబాటులో ఉన్నా, అవి చూడటానికి మాత్రమే బాగుంటాయి. వాటితో పనులు చేసుకోవడం, బరువులు ఎత్తడానికి వీలుండ దు. కానీ, ఎల్ఎన్4 హ్యాండ్స్ రాయడం, పెయింటింగ్, టీ తాగడం, బిస్కెట్లు తినం లాంటి చిన్న చిన్న పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఇంజెక్షన్ మోల్డెడ్ ప్లాస్టిక్, అల్యూమినియం, ఇత్తడి, స్టీల్‌తో రూపొందించిన ఈ వస్తువులను పట్టుకోవచ్చు. వేళ్ల ఆకారంతో ఉన్న ప్రత్యేక అమరికతో పెన్నులు, పెన్సిళ్లతో రాయవచ్చు. కేవలం 400 గ్రాముల బరువు ఉన్న ఈ చేతి పరికరంతో సుమారు 4.45 కేజీల బరువును అవలీలగా ఎత్తవచ్చని చెప్పారు.
28న ఉచితంగా పంపిణీ..
అత్యాధునిక టెక్నాలజీతో కృత్రిమ చేతిని రూపొందిస్తారు. మనదేశంలో 24వేల ఎల్ఎన్4 మెకానికల్ హ్యాండ్స్‌ను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. వివిధ ప్రసార, సామాజిక మాధ్యమాల ద్వారా అవసరమున్న వారికి వీటిని అందిస్తున్నామని, అందులో భాగంగా నగర వ్యాప్తంగా ఎంపిక చేసిన వారికి ఈ చేతులను ఉచితంగా ఇస్తామని, ఈ నెల 28న దూలపల్లి మైసిగండిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో మెగా క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కావాల్సిన వారు ఫోన్ నంబర్లు 90109 21333, 96182 71416, 99899 92768లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.