సీనియర్ ఫ్యాకల్టీతో బోధన
త్వరలో తరగతులు ప్రారంభం
క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
సిటీబ్యూరో, మార్చి 28 : పోలీసు ఉద్యోగంలో చేరాలనుకునే వారికి పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణను త్వరలో ప్రారంభిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఎంతో మంది అభ్యర్థులకు గతంలో ఉద్యోగాలు సాధించేందుకు చేయూతనిచ్చినట్లు గుర్తు చేశారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా బోధన తరగతులు నిర్వహించి, పోటీ పరీక్షల్లో రాణించేందుకు అవసరమైన జ్ఞానాన్ని అందించనున్నట్లు వివరించారు. ఆసక్తి ఉన్న వారు http://form. jotform.com/ 220792437998473, క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో దరఖాస్తు ఫారం నింపి పంపించాలని సూచించారు. ఇతర సందేహాలకు వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 9490616555ను సంప్రదించాలన్నారు.