Photography Diploma | హిమాయత్ నగర్ ఫిబ్రవరి 14: నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ఉచిత ఫోటో గ్రఫీ డిప్లోమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిగ్మా అకాడమీ చైర్మన్ ఎం.సి.శేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. యువత ఫోటోగ్రఫీ నేర్చుకోవడం పట్ల ఆసక్తి ఉంటే ఈ కోర్సులో చేరి ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. ఆరు నెలల పాటు ఆఫ్లైన్, ఆన్లైన్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఫోటోగ్రఫీ, పిక్టోరియల్ షూటింగ్ నైపుణ్యాలు, ఆధునాతన సాంకేతికతలు, కంపొజిషన్, లైటింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని శేఖర్ తెలిపారు. 4వ బ్యాచ్ శిక్షణ తరగతులు మార్చి15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెల్ నెం : 8008021075, 7095692175 ఫోన్ నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.