ఖైరతాబాద్, ఆగస్టు 31 : నిమ్స్ దవాఖానలో హృద్రోగంతో బాధపడుతున్న చిన్నారులకు నేటి నుంచి 21వ తేదీ వరకు బ్రిటన్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత గుండె శస్త్ర చికిత్సలను నిర్వహించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ఓ ప్రకటనలో తెలిపారు. పుట్టుకతో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలను పరీక్షించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేస్తారని, వాటికయ్యే ఖర్చులు ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భరిస్తారని తెలిపారు.
బాధిత చిన్నారుల తల్లిదండ్రులు నిమ్స్ పాత భవనంలోని సీటీవీఎస్ కార్యాలయంలో కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ అరమేశ్వర రావు, డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ గోపాల్‌లను మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంప్రదించాలని, పూర్వపు రిపోర్టులు తమ వెంట తీసుకురావాలని సూచించారు.