మలక్పేట, మార్చి 12 : మలక్పేట మూసారాంబాగ్ చౌరస్తాలోని అజీబో రెస్టారెంట్లో ఫ్రీ హలీం పంపిణీ ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. రంజాన్ మాసం మొదటి రోజును పురస్కరించుకొని ఫ్రీగా హలీం పంపిణీ చేయనున్నట్లు రెస్టారెంట్ నిర్వాహకులు బోర్డు పెట్టడంతోపాటు ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టడంతో మంగళవారం సాయంత్రం రెస్టారెంట్ వద్దకు వేలాదిగా చేరుకున్నారు.
ఏడు గంటలకు హలీం పంపిణీ ప్రారంభించగా.. ఒక్కసారిగా జనం ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకున్నది. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించి పోవడంతో రంగంలోకి దిగిన మలక్పేట పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. రెస్టారెంట్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.