హైదరాబాద్ : కంటోన్మెంట్ వాసులకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేయనున్నట్లు మంత్రి తలసానికి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో 62 కంటోన్మెంట్ బోర్డులు ఉండగా ఒక్క తెలంగాణలో మాత్రమే ముఖ్యమంత్రి ఆదేశాలతో అమలు అవుతోందన్నారు.
కంటోన్మెంట్ ప్రజలు కూడా మా బిడ్డలే. వారిని కన్నబిడ్డలుగా తెలంగాణ ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. కంటోన్మెంట్ బోర్డులో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరించాలని మంత్రి తలసాని కోరారు.