సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ) : రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థులను ప్రధానంగా ఎంచుకుని భద్రతా చర్యలపై అవగాహన కల్పించడానికి ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా రవాణా శాఖ శుక్రవారం ఆర్టీఏ ఆధ్వర్యంలో పలువురు వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ చేశారు.
ఇప్పటికే నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మొదటి ట్రాఫిక్ ట్రెయినింగ్ పార్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సిగ్నల్స్ నుంచి రోడ్డు భద్రత వరకు అన్నీ జాగ్రత్తలు తీసుకునేల అవగాహన కల్పిస్తున్నారు. వీటితో పాటు పాఠశాల విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీ విద్యార్థులతో రోడ్డు భద్రత క్లబ్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 59 క్లబ్‌లు ఏర్పాటు చేసినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు.