కేపీహెచ్‌బీ కాలనీ: కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్‌లో ముత్తుట్ ఫైనాన్స్‌లో మేనేజర్‌గా ప్రియాంకరెడ్డి గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నది. ముత్తుట్ ఫైనాన్స్‌కు గోల్డ్‌లోన్ కోసం వచ్చే వినియోగదారుకు ఈ సంస్థలో తాకట్టు పెట్టిన బంగారాన్ని మరో సంస్థలో తాకట్టు పెడితే.. తక్కువ వడ్డీ.. ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించేది. కొందరు వినియోగదారులు బంగారాన్ని ఆమెకు అప్పగించారు. వేరే బంగారం తాకట్టు సంస్థలో పెట్టి వచ్చిన డబ్బులను తన సొంత అవసరాలకు వాడుకుంది.
వినియోగదారుల లోన్‌ను క్లోజ్ చేయకుండా పొంతనలేని సమాధానాలు చెబుతూ కాలయాపన చేస్తున్నది. సుమారు 20 మంది బాధితులు శుక్రవారం కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులను ఆశ్రయించారు. బాధితులతో పాటూ ముత్తుట్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. సంస్థ నుంచి, బాధితుల నుంచి అధికారికంగా ఫిర్యాదు రాలేదని కేపీహెచ్‌బీ కాలనీ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదు చేసి వివరాలను వెల్లడిస్తామన్నారు.