Hyderabad | హైదరాబాద్ : అంబర్పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన ఓ నలుగురు విద్యార్థులు బుధవారం సాయంత్రం అదృశ్యమైన సంగతి తెలిసిందే. దాదాపు 24 గంటల తర్వాత ఆ పిల్లల ఆచూకీ లభ్యం కావడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నలుగురు విద్యార్థులు యాదగిరిగుట్టలోని తమ బంధువుల ఇంట్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పిల్లలను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు అంబర్పేట్ పోలీసులు యాదగిరిగుట్టకు వెళ్లారు.
ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎండి అజమత్ అలీ(13), కొండ్‌పేట తేజ్‌నాథ్ రెడ్డి(13), నితీష్ చౌదరి(13), కోరే హర్ష వర్ధన్(13) నలుగురు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. నలుగురు కలిసి బుధవారం నుంచి కన్పించకుండా పోయారు. వెంటనే అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.