కొండాపూర్, జనవరి 15 : మద్యం మత్తులో బైక్‌పై అతివేగంగా వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్సీపురంలో నివాసం ఉండే ఫ్రాంక్లిన్ ఫిలిక్స్ (27) జిమ్ ట్రైనర్. సంక్రాంతి పండుగలో భాగంగా ఫ్రాంక్లిన్ కోకాపేట్లో స్నేహితులతో కలిసి మద్యం సేవించి..ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. నల్లగండ్ల సమీపంలోకి రాగా మద్యం మత్తు లో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని యువకుడు..
జీడిమెట్ల, జనవరి 15 : రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. జీడిమెట్ల పోలీసుల వివరాల ప్రకారం.. చింతల్ గణేశ్‌నగర్‌కు చెందిన లక్ష్మీవరమోహన్ కుమారుడు దేవహర్ష(26) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈనెల 14 రాత్రి 10గంటలకు ఐడీపీఎల్ నుంచి కుత్బుల్లాపూర్వైపు బైక్‌పై వస్తున్నాడు. చింతల్ కేఎఫ్‌సీ వద్ద యూటర్న్ తీసుకుంటున్న పవన్‌రెడ్డి బైక్, దేవహర్ష బైక్‌లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో దేవహర్ష మృతిచెందగా పవన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని సూరారంలోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని సెక్యూరిటీ గార్డు ..
శేరిలింగంపల్లి, జనవరి 15 : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేష న్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం …అస్సాం రాష్ర్టానికి చెందిన నారాయణ్ హజరిక(55) నగరానికి వచ్చి కొండాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నా డు. కాగా.. మంగళవారం రాత్రి కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వర్చువల్ సఫారీ ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న నారాయణ్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని కొండాపూర్ రాఘవేంద్రకాలనీలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం అతను మృతిచెందాడు. భార్య రంజన్ హాజరిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తునానరు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
జగద్గిరిగుట్ట, జనవరి 15 : రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. జగద్గిరిగుట్ట పోలీసుల వివరాల ప్రకారం .. ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన నారాయణస్వామి (59) ఈ నెల 11న బైక్‌పై మనుమరాలిని తీసుకుని వెళ్తుండగా దీనబంధు కాలనీవద్ద అదుపుతప్పి పడిపోగా నారాయణస్వామి తలకు తీవ్ర గా యమైంది. అతన్ని గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారంమృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.