అల్వాల్, ఏప్రిల్ 5: మల్కాజిగిరి నియోజకవర్గం మెడికల్ హబ్‌గా మారుతున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం ఆయన ఓల్డ్ అల్వాల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనానికి అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అల్వాల్‌లో ఇప్పటికే టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మం జూరైందని, పనులు కూడా ప్రారంభం అయ్యాయని చెప్పారు. ఇప్పుడు పాత పీహెచ్సీ భవనంలో కొత్త బిల్డింగ్ కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు, ఆసుపత్రి నిర్మాణానికి ఉచితంగా స్థలం ఇచ్చిన దాత భీమ్రావుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవనాన్ని ఏడాదిన్నరలోపు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని గుత్తేదారును ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి కృషితో అల్వాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని కొనియాడారు.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు: కార్పొరేటర్
అల్వాల్ పీహెచ్సీ నూత భవనం పూర్తైతే అన్ని సదుపా యాలు అందుబాటులోకి వస్తాయని, దీని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అం దుతాయని అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. దవాఖాన భవనానికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. పనుల్లో నాణ్యత పాటిస్తూనే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. స్థలం విరాళం ఇచ్చిన భీమ్రావు కుటుంబ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ఆనంద్, పీహెచ్సీ వైద్యురాలు లక్ష్మీప్రసన్న, వైద్య సిబ్బంది అరుణ, వీరన్న, శ్రీకాంత్, నాయకులు రాజనర్సింహా, లక్ష్మణ్, కవిత, అర్వింద్, తదితరులు పాల్గొన్నారు.