శంషాబాద్ రూరల్; అక్టోబర్ 19 : బీఆర్ఎస్తోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, శంషాబాద్ మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్‌తోపాటు 500 మందికి పైగా మాజీ మంత్రి సబితారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్రెడ్డిల ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్ల పాటు కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కానీ అనేక తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండు సంవత్సరాల్లోనే తెలంగాణను దివాలా తీయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప కాంగ్రెస్ చేసిన ఒక అభివృద్ధి పని లేదన్నారు.వ్యవసాయానికి నీరులేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధిచెప్పాలని సూచించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పాతాలంలోకి తొక్కాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సతీశ్, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌రావు, మాజీ సర్పంచ్ సత్యనారాయణగౌడ్,దిద్యాల శ్రీనివాస్, మంచర్ల శ్రీనివాస్, కొన్నమొల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి
– శంషాబాద్ మాజీ ఎంపీపీ ఎల్లయ్య
గ్రామాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరినట్లు శంషాబాద్ మాజీ ఎంపీపీ ఎల్లయ్య తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తమ సత్తాచాటుతామని పేర్కొన్నారు. తనతోపాటు మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, సహకార సంఘం డైరెక్టర్లు నర్సింహముదిరాజ్,ప్రమోద్పటేల్, మాజీ సర్పంచ్ ఇస్రానాయక్, మాజీ ఎంపీటీసీ గోపాల్‌నాయక్, మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి గణేశ్, మాజీ ఉప సర్పంచ్‌లు నారాయణయాదవ్, సురేశ్‌నాయక్, మహేశ్యాదవ్లతో పాటు పలువురు కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు