ఖైరతాబాద్, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్రం లో సీఎం కేసీఆర్ నాయకత్వమే గిరిజనులకు స్వర్ణయుగమని గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గిరిజనులపై చూపుతున్న వివక్షను ఖండించారు. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు ఓట్లు వేసినా గిరిజనుల బతుకుల్లో ఎలాం టి మార్పు రాలేదన్నారు. మాయమాటలు చెప్పి గిరిజనులను మోసగించడం కాంగ్రెస్ పార్టీకి వెన్న తో పెట్టిన విద్య అని అన్నారు.
గిరిజన, లంబాడీలకు టికెట్ల కేటాయింపులో సైతం అన్యాయం చేసిందని, గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టడానికి ఎస్టీ తెగలను వర్గీకరణ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించడం దురదృష్టకరం అని అన్నారు. ఈ ఎన్నికల్లో వెయ్యి రూపాయలు, సారా సీసా ఇస్తే ఓట్లు వేస్తారని వ్యాఖ్యానించి యావత్ గిరిజనాన్ని కించపరిచారని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారన్నారు. కాంగ్రెస్ పార్టీ కి, రేవంత్ రెడ్డిని 30న గిరిజనులు ఓట్ల రూపం లో పాతాళంలోకి తొక్కివేయాలన్నారు.
స్వరాష్ట్రం లో గిరిజనులకు గతంలో ఎన్నడూ లేని విధంగా పది శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు 3,500లకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, విదేశాల్లో చదువుకునేందుకు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారని, గిరిజన లంబాడీల ఆత్మగౌరవానికి ప్రతీకగా బంజారాహిల్స్‌లో బంజారా భవన్ నిర్మించారన్నారు. బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు.
గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సీఎం ఎస్టీ ఎంట్రప్రీనియర్ ద్వారా కోటిన్నర రూపాయల వరకు రుణ సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు. గిరి వికాస్ పథక ద్వారా బోర్లు వేసి మోటారుతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించారన్నారు. గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి కోచింగ్ కేంద్రాల ఏర్పాటు, గురుకులాలకు మౌలిక సదుపాయల కల్పన లాంటి కార్యక్రమాలను చేపట్టారన్నారు. గిరిజన సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు హ్యాట్రి క్ విజయాన్ని అందించాలని, ప్రతి గూడెం, తం డాలకు వెళ్లి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షే మ పథకాల గురించి వివరించాలని, 30న పోలింగ్ సందర్భంగా ప్రతి ఒక్కరు బీఆర్ఎస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.