వెంగళరావునగర్, అక్టోబర్ 13: తాను ఉన్నంతకాలంలో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురనీయనని మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువనర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. మాగంటి బిడ్డలకు తాను బాబాయ్‌లా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సోమవారం రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ..
తనను 2 సార్లు గోపన్న ఓడించారని.. పీజేఆర్ కుమారుడిని ఓడించానని గోపన్న అంటుండేవారని.. కౌంటింగ్ కేంద్రంలో కూడా రాజకీయ ప్రత్యర్థుల్లా కాకుండా స్నేహపూర్వకంగా తాముండేవారని అన్నారు. మాగంటి గోపినాథ్ ఎస్పీఆర్హిల్స్ లో రూ.4 కోట్ల వ్యయంతో మంచినీటి రిజర్వాయర్‌ను నిర్మించి అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ‘ఇప్పుడున్నది ఇందిరా కాంగ్రెస్ కానేకాదని.. అమ్మకానికి ఉన్న కాంగ్రెస్’ అని ఎద్దేవా చేశారు. టిక్కెటిస్తే ఎంతిస్తావు అని గతంలో కాంగ్రెస్ నాయకులు తనను అడిగారని.. కాంగ్రెస్‌లో అవినీతి రాజ్యమేలుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను గెలిపించాలని కోరారు.