హైదరాబాద్ : బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుండి పీపుల్స్ ప్లాజాలోప్రారంభం కానున్న బతుకమ్మ వేడుకలు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పుట్టిన బతుకమ్మ నేడు దేశ విదేశాలలో ఘనంగా జరుపుకుంటున్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతో వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించామన్నారు.
బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశాం. కేటీఆర్ చొరవతో పీపుల్స్ ప్లాజాలో మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ కోసం ఏర్పాట్లు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చీరలను పంపిణీ చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన లోని వ్యత్యాసాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారన్నారు.