కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 25 : పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలు(Free medical camp) నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్( Srinivas Goud), కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కూకట్పల్లి నియోజకవర్గంలో బాలాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్, యశోధ వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ..కాలనీలు, బస్తీలలో నివసించే పేద ప్రజలు ఉచిత వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సకాలంలో రోగాన్ని గుర్తించడం వల్ల సకాంలో వైద్యసేవలు పొందవచ్చన్నారు. గుర్తించం ఆలస్యమైతే… రోగ తీవ్రత పెరుగుతందని తద్వారా చికిత్స పొందడం ఇబ్బంది అవుతుందన్నారు. మారుతున్న వాతవరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ముందస్తూ ఆరోగ్య పరీక్షలు చేసుకుని, ఆరోగ్యవంతులుగా జీవించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పగుడాల శిరీష, ముద్దం నర్సింహాయాదవ్, మాజీ కార్పొరేటర్ పి.బాబురావు, డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్, కార్యదర్శి వెంకటేశ్‌చౌదరి, డాక్టర్ వెంకట్రావు, కె.నాగరాజు, రవీందర్‌రెడ్డి, అంజిరెడ్డి, సుభాష్‌గౌడ్, సురేశ్‌గౌడ్, పృధ్విరాజ్, కల్యాణి, శారద తదితరులు పాల్గొన్నారు.