బడంగ్ పేట్, జూన్ 17: పెద్ద చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెద్ద చెరువును మంగళవారం ఆమె సందర్శించారు. చెరువు పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. . బతుకమ్మ ఘాట్, వాకర్స్ ట్రాక్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్, స్ట్రీట్ లైట్స్, వాలీబాల్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చెరువు సుందరీకరణ పనులపై ఆరా తీశారు. సుందరీకరణ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని అధికారులను ప్రశ్నించారు. చెరువుకు ఆనుకొని ఉన్న వైకుంఠధామాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, డీఈ వెంకన్న, ఏఈ, కార్పొరేషన్ అధ్యక్షుడు కామేశ్ రెడ్డి, దిండు భూపేశ్ గౌడ్, భూపాల్ రెడ్డి, రాజ్ కుమార్, రామిరెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, ప్రభాకర్ రెడ్డి, మదారి రమేశ్, అంజయ్య, జంగయ్య, సోషల్ మీడియా కన్వీనర్ వీర రాఘవరెడ్డి, సునీత బాలరాజ్, విజయలక్ష్మి, నిర్మల పాల్గొన్నారు.