శామీర్ పేట, ఫిబ్రవరి 3: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కుట్రలు, కుతంత్రాలతో ప్రతిపక్ష పార్టీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి మున్సిపల్ ఎన్నికలే నాంది పలుకుతాయని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం అలియాబాద్ మున్సిపాలిటీలోని పిస్తా హౌస్ సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న వార్డు అభ్యర్థులకు బీఫారంలను మల్లారెడ్డి అందజేశారు. పార్టీ అభ్యర్థులు ఐక్యతతో పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
అలియాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు..
వార్డు నంబర్ 1 నుంచి అపావతి వెంకటేశ్ , వార్డు నంబర్ 2 చీరల లావణ్య, వార్డు నంబర్ 3 దాసరి రవి, వార్డు నంబర్ 4 జీడిపల్లి కవిత, వార్డు నంబర్ 5 ఆల భారతి లక్ష్మిరెడ్డి అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.అదేవిధంగా వార్డు నంబర్ 6 నుంచి తలారి కృష్ణ, వార్డు నంబర్ 7దాసరి నర్సింహ, వార్డు నంబర్ 8 బండి శ్వేతా లక్ష్మి, వార్డు నంబర్ 9 యమునా శ్యాం, వార్డు నంబర్ 10 ఏ మాధవి గౌడ్ పార్టీ తరఫున పోటీ చేయనున్నారు.
వార్డు నెంబర్ 11 నుంచి మోహన్ రెడ్డి, వార్డు నంబర్ 12 హనుమాన్ దాస్ గౌడ్, వార్డు నంబర్ 13 నుంచి ఎండీ యూస్ బాబా, వార్డు నంబర్ 14 నుంచి బండి శ్యామల రవి, వార్డు నంబర్ 15 నుంచి నేమూరి ఇందిరా మల్లికార్జున్ అభ్యర్థులుగా ఖరారయ్యారు. వార్డు నంబర్ 16 నుంచి చిదు వనజ శ్రీనివాస్ రెడ్డి, వార్డు నంబర్ 17 నుంచి మధుసూదన్ రెడ్డి, వార్డు నంబర్ 18 నుంచి సగ్గు శ్రీనివాస్, వార్డు నంబర్ 19 నుంచి కుమార్ యాదవ్, వార్డు నంబర్ -20 నుంచి బోయిని రోజా రాజు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో నిలిచారు.
బీఆర్ఎస్లోకి కొనసాగుతున్న వలసలు
మేడ్చల్, ఫిబ్రవరి3(నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో మంగళవారం అలియాబాద్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్‌తో పాటు మరో 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా ఎల్లంపేట్ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకుడు అశోక్ 15 మంది కార్యకర్తలతో బీఆర్ఎస్లో చేరారు.
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దు
మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 3: తెలంగాణను బీడు భూమిగా మార్చిన కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఎల్లంపేట మున్సిపాలిటీలో సోమారం, రావల్కోల్ గ్రామాల్లో మంగళవారం ఆయన ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్తోనే నగర అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మహేందర్‌రెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ వెంకట్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, భాగ్యరెడ్డి, నవీన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఈశ్వరయ్య, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.