మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్లో చేరిన మాజీ కార్పొరేటర్ శ్రీదేవి హన్మంతరావు, చిత్రంలో మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ తదితరులు.
– నేరేడ్మెట్, నవంబర్ 5
నేరేడ్మెట్, నవంబర్ 5: ప్రగతి భవన్‌లోని మంత్రి కేటీఆర్ కార్యాలయంలో ఆదివారం నేరేడ్మెట్ డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కటికనేని శ్రీదేవి హన్మంతరావు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్, మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ కలిసి కె.శ్రీదేవి హన్మంతరావుకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో బీజేపీ నాయకులు జీకే హన్మంతరావు, మధుసూదన్ రెడ్డి, రాంరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సుపరిపాలన సాధ్యమని, కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉపేందర్ రెడ్డి, సుదర్శన్ రావు తదితరులు ఉన్నారు.