ఖాళీ బిందెలతో నిరసన
తాగునీటి సరఫరాలో వైఫల్యాలు సామాన్యులను ఎంతలా బాధిస్తున్నాయనే విషయాన్ని అధికారులు స్వయంగా వినియోగదారుల ఇళ్లను సందర్శించి తెలుసుకోవాలని మాజీ కార్పొరేటర్ శేషుకుమారి కోరారు. తాగునీళ్లు ఇవ్వాల్సిందేనంటూ వినియోగదారులు, బీఆర్ఎస్ శ్రేణులు కలిసి ఖాళీ బిందెలతో సోమవారం ఎస్ఆర్నగర్ జలమండలి కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు.
అమీర్పేట్, మే 25 : తాగునీటి సరఫరాలో వైఫల్యాలు సామాన్యులను ఎంతలా బాధిస్తున్నాయనే విషయాన్ని అధికారులు స్వయంగా వినియోగదారుల ఇళ్లను సందర్శించి తెలుసుకోవాలని మాజీ కార్పొరేటర్ శేషుకుమారి కోరారు. తాగునీళ్లు ఇవ్వాల్సిందేనంటూ వినియోగదారులు, బీఆర్ఎస్ శ్రేణులు కలిసి ఖాళీ బిందెలతో సోమవారం ఎస్ఆర్నగర్ జలమండలి కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. నీటి సరఫరా జరగకపోతే పిల్లలు, వృద్ధులతో కూడిన సామాన్య కుటుంబాలు ఎలా జీవిస్తాయనే విషయాన్ని అధికారులు కనీసం ఆలోచిస్తున్నారా అంటూ మండిపడ్డారు.
కమర్షియల్ ట్యాంకర్లను కొనుగోలు చేయలేని మురికివాడల వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనంగా ఉచిత నీటి ట్యాంకర్ల ద్వారా అయినా సరఫరా చేయమని అడిగితే.. ఇప్పుడు ఉచిత ట్యాంకర్లు వ్యవస్థను రద్దు చేశామని అధికారులు సమాధానాలిస్తున్నారని విమర్శించారు. కమర్షియల్ ట్యాంకర్లు కొనే స్థోమత లేని పేదల బస్తీలకు తాత్కాలిక ఉపశమనంగా ఉచిత ట్యాంకర్లు పంపాలని లేకపోతే నిరసన మరింత తీవ్ర రూపం దాలుస్తుందని ఆందోళన ప్రదర్శన వద్దకు వచ్చిన జీఎం, డీజీఎం, మేనేజర్లకు మాజీ కార్పొరేటర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

