ఆహారం తయారీలో సింథటిక్ కలర్ వినియోగం
25 చోట్ల తనిఖీలు, 23 శాంపిల్స్ సేకరణ
Pista House | సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : పిస్తా హౌస్ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. గ్రేటర్ వ్యాప్తంగా 25 పిస్తాహౌస్ రెస్టారెంట్లలో సోదాలు నిర్వహించి 23 చోట్ల శాంపిల్స్ సేకరించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని తనిఖీలో తేల్చారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉందని, కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నట్లు గుర్తించారు. నాన్‌వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు అధికారులు చెప్పారు. తుప్పు పట్టిన నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించినట్లు, కిచెన్ గదులు అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు తేల్చారు. శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తెలిపారు.
పిస్తా హౌస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
కిచెన్‌లో ఎలుకలు, బొద్దింకలు, ఈగలు ఉన్నట్టు గుర్తింపు
హైదరాబాద్ లోని 25 పిస్తా హౌస్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్టు, తుప్పు పట్టిన… pic.twitter.com/Dz8cFL3GX3
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025