సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఉక్కుపాదం మోపుతున్నది నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే గురువారం నగరంలోని పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీలు నిర్వహించింది.
సంతోష్‌నగర్‌లో 4 ఎం వ్యాపారులు, మెహిదీపట్నంలో కింగ్స్ రెస్టారెంట్, కేఫ్, యూసుఫ్‌గూడ ఉషోదయ సూపర్ మార్కెట్, జుమ్రత్ బజార్ వద్ద జై భవానీ, చాంద్రాయణగుట్టలో క్రీమ్ ఫిల్స్ ఐస్‌క్రీమ్ తయారీ యూనిట్లపై తనిఖీలు చేపట్టగా..ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించలేదని పరిశీలనలో తేలింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేశామని, ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.