సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని వ్యాపారస్తులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో బండారాలు బయటపడుతున్నాయి. గురువారం ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు వెస్ట్మారేడ్పల్లిలోని పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
ప్రముఖ ఆలివ్ మిఠాయి షాపులో నామ్కీన్, మిక్చర్, చకోడి తదితర ప్యాకెట్లపై లేబుళ్లు సరిగా లేవని, లైసెన్స్ నంబరు, లోగో, తయారీదారుల వివరాలు లేవని గుర్తించారు. జీబీ పాన్ ప్లేస్లో డస్ట్ బిన్లకు సరైన మూతలు లేవని , ఫుడ్ హ్యాండర్లకు హెయిర్క్యాప్, గ్లౌవ్స్ లేవని గుర్తించారు. రత్నదీప్ రిటైల్ మార్కెట్లో చీజ్లు , బ్లూ బెర్రీస్ ప్యాకెట్లు ఇతర వాటికి లేబుల్స్ సరిగా లేనట్లు గుర్తించి.. నోటీసులు జారీ చేశారు.