e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఆరోగ్యం చక్కటి ఆహారం అందిస్తుంది బలం

చక్కటి ఆహారం అందిస్తుంది బలం

చక్కటి ఆహారం అందిస్తుంది బలం
 • కరోనా వణికిస్తుందా..?
 • పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉన్నట్లే..!
 • ఆహారంతో పాటు నిత్యం వ్యాయామం అవసరం!
 • కొవిడ్‌ లక్షణాలున్న వారు, లేనివారు డైట్‌ పాటించాల్సిందే..
 • నిర్లక్ష్యం వహిస్తే కరోనా మహమ్మారి సోకే ప్రమాదముంది
 • జాగ్రత్తలతోనే కొవిడ్‌ను నిర్మూలన: వైద్య నిఫుణులు

కరోనా వైరస్‌ సోకుతుందని భయపడుతున్నారా..? మీకు ఇప్పటికే సంక్రమించిందా? మీ శరీరానికి వైరస్‌ను తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ పవర్‌ ఉందో… లేదోనని ఆందోళన చెందుతున్నారా? అయితే, ఈ సమయంలో నిత్యం వైద్య, ఆహార నిఫుణులు (న్యూట్రిషియన్స్‌) సూచించిన డైట్‌ను తప్పకుండా పాటిస్తే, మీకు ఇమ్యూనిటీ పవర్‌ పెరగడంతో పాటు కరోనా సోకినా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని నిఫుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆహారపరంగా ఇది చాలా కీలకమని ప్రజలు గుర్తించాలి. పౌష్టిక ఆహారాన్ని రోజు వారి డైట్‌లో తీసుకుంటే కరోనానే కాకుండా పలు రకాల వ్యాధులను దూరం చేయొచ్చని వైద్య నిఫుణులు చెబుతున్నారు.

కొవిడ్‌ – 19 ప్రస్తుతం హైదరాబాద్‌ మహా నగరాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా రెండో దశ జన జీవనానికి ఇబ్బందికరమైన వాతావరణాన్ని తెచ్చి పెట్టింది. సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా వ్యాప్తి చెందడంతో చాలా మంది భయపడుతున్నారు. వైరస్‌ను ముందుగానే గుర్తిస్తే కోలుకోవడం చాలా సులభమే. అయితే, సెకండ్‌ వేవ్‌లో లక్షణాలు అంత తర్వగా బయటపడటం లేదు. కొంత మందికి రిపోర్టుల్లో నెగటివ్‌ వచ్చినా.., వారి శరీరంలో కొవిడ్‌ ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉండి… పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లయితే వైద్యులు సిటీ స్కాన్‌ ద్వారా కొవిడ్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఒక వేళ మీరు ఆరోగ్యకరమైన ఆహారానికి, అలవాట్లకు దూరంగా ఉన్నట్లయితే ఇప్పటి నుంచే మార్పు రావాలి. నిర్లక్ష్యం వహిస్తే కరోనా మహమ్మారికి బలయ్యే ప్రమాదం ఉంది. మీకు కరోనా సోకుతుందనే భయం వెంటాడుతున్నా, ఇప్పటికే మీరు కరోనాతో బాధపడుతున్నా ఆందోళన చెందవద్దని ప్రముఖ న్యూట్రిషియనిస్ట్‌ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. శరీరంలో కరోనా వైరస్‌ తట్టుకునేలా ఉండే ఈ డైట్‌ను క్రమంగా తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.

డైట్‌తో పాటు వ్యాయామం..

మనిషి శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, వ్యాయామం కూడా అంతే అవసరం. రోజుకు మూడు పూటలా ఆహారం తీసుకున్నా, ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రం గంట సమయం పాటు వ్యాయామం చేస్తే మానసిక ఉల్లాసంతో పాటు శరీరంలో అన్ని భాగాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యవంతులు గాను ఉండవచ్చని వైద్య నిఫుణులు సూచిస్తున్నారు. ఏ వృత్తిలో ఉన్న వారైనా క్రమం తప్పకుండా రోజు కొంత సమయం పాటు వ్యాయామం చేస్తే అది దీర్ఘకాలికంగా ఆరోగ్యవంతులు ఉండేందుకు దోహదపడుతుంది. ప్రస్తుతం కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ మోతాదుకు మించి కాకుండా కొంత సమయం పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో అన్ని అవయవాలు సరిగా పనిచేసేందుకు, ఆకలి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల పౌష్టికాహారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు ఆహారపు నియమాలను పాటిస్తే వారు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.

రోజు వారి ఆహారం మెనూ..

 • ప్రతిరోజు మూడు పూటలా పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా కొవిడ్‌-19 నుంచి త్వరగా కోలుకోవచ్చు.
 • కొవిడ్‌తో బాధపడుతున్నారు ఇవి తీసుకోవాలి.
 • కొవిడ్‌ సోకుతుందేమోనన్న భయంతో వణికిపోతున్న వారు సైతం ఈ మెనూను పాటించాలి.
 • రోజు వారి ఆహారంలో విటమిన్‌-సీ, జింక్‌ ఉండేలా చూసుకోవాలి.
 • నీటిలో నానబెట్టిన నట్స్‌, సీడ్స్‌ తీసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లే కాకుండా మంచి పోషకాలు సైతం ఉంటాయి.
 • రాగి జావా లేదా ఓట్స్‌, విటమిన్‌-బీ, సంక్లిష్ట పిండి పదార్థాలు ఉండే ఆహారం.
 • క్రమం తప్పకుండా గుడ్డు తినాలి.
 • కరోనా వల్ల జ్వరంతో బాధపడుతుంటే కిచిడీ తినండి.
 • నీళ్లు ఎక్కువగా తాగండి. హైడ్రేషన్‌ ఎలాంటి అనారోగ్యం నుంచైనా త్వరగా కోలుకునేలా చేస్తుంది.
 • నీళ్లు మాత్రమే కాకుండా ఓఆర్‌ఎస్‌, కొబ్బరి నీరు, హెర్బల్‌ టీలు తీసుకోండి.
 • బట్టర్‌ మిల్క్‌ కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది.
 • ఏ పూటకు ఆ పూట తాజాగా వండిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
 • పండ్లు, కూరగాయలు మీ డైట్‌లో తప్పకుండా ఉండాలి.
 • పాలకూర, టమాట, బీట్‌రూట్‌ ఎక్కువగా తీసుకోవాలి.
 • మధుమేహం, గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలుంటే మాత్రం వైద్యుల సూచనల ప్రకారం నిత్యం పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
 • ప్రధానంగా మంచి ఆహారాన్ని తీసుకుంటే ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం, వీలైతే తరచూ యోగా వంటి చేయాలి.

పోషక విలువలున్న ఆహారాన్నే తీసుకోవాలి

అందరినీ ఎంతగానో భయపెడుతున్న కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలన్నా, ఒక వేళ వచ్చినా మనం తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలి. పండ్లు, నట్స్‌, అన్నం, చఫాతి, గుడ్లు ఇలా ఏది తినగలిగితే అది రోజు వారి మెనూలో ఉండేలా చూసుకోవాలి. ప్రధానంగా తీసుకునే ఆహారం వేడిగా ఉండాలి. ప్రస్తుతం, సీజన్‌ కూడా మారుతోంది. దానికి అనుగుణంగా ఆహారం తీసుకోవాలి. – గాయత్రి నెమలికంటి, సర్టిఫైడ్‌ క్లినికల్‌ న్యూట్రీషియనిస్ట్‌

Advertisement
చక్కటి ఆహారం అందిస్తుంది బలం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement