సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): జంట జలాశయాలకు ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగింది. గురువారం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఒక గేటును నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉస్మాన్‌సాగర్ 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1762.90 అడుగుల వరకు ఉన్నది. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.30 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువ నుంచి 1200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది.