Hyderabad | హైదరాబాద్లోని పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఐదుగురు విద్యార్థులు మత్తు పదార్థాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. నాగార్జున సర్కిల్ దగ్గర ఐదుగురు విద్యార్థులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులకు కనిపించారు. దీంతో వారిని ఆపి పోలీసులు తనిఖీ చేయగా.. వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి 10 గ్రాములు ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, పట్టుబడ్డ విద్యార్థులంతా ఒకే కాలేజీకి చెందిన వారు కావడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల దగ్గరకు డ్రగ్స్ ఎలా వచ్చాయి? వారికి ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే కోణంలో విచారిస్తున్నారు.
హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ కలకలం
ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు
నాగార్జున సర్కిల్ వద్ద డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ యువకులు
విద్యార్థుల నుంచి 10 గ్రాముల MDMA స్వాధీనం
పట్టుబడ్డ ఐదుగురు విద్యార్థులు ఒకే కాలేజీలో చదువుతున్నట్లు గుర్తింపు pic.twitter.com/4TZLQ04cSS
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2026